![]() |
![]() |
.webp)
బుల్లితెర మీద ఒక్కసారి బాగా క్లిక్ ఐతే వాళ్లకు వచ్చే హెడ్ వెయిట్ అంతా ఇంతా కాదు. చాలా మందికి స్టేటస్ అమాంతం వచ్చేసరికి బిల్డప్ ఇస్తూ ఉంటారు. కానీ సుడిగాలి సుధీర్ తనకు ఎంత నేమ్ అండ్ ఫేమ్ వచ్చినా అది ఎప్పుడూ బయట ప్రదర్శించుకోవడం ఆడియన్స్ ఇప్పటివరకు చూసింది లేదు. మిగతా స్టార్స్ లానే సుధీర్ కూడా షూటింగ్స్ వంటి వాటి మధ్య కొంచెం గ్యాప్ దొరికినా ఆ టైంని ఫ్యామిలీతో స్పెండ్ చేస్తూ ఉంటాడు సుధీర్. రీసెంట్ గా తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు.
సుధీర్ కి రోహన్ అనే తమ్ముడు ఉన్నాడన్న విషయం తెలిసిందే. ఐతే అతనికి పెళ్లై చిన్న పాప కూడా ఇటీవలే పుట్టింది. ఆ పాపను ఎత్తుకుని దిగిన ఫోటోని షేర్ చేసాడు సుధీర్. దానికి ఒక టాగ్ లైన్ కూడా పెట్టుకున్నాడు. ‘నా చివరి శ్వాస వరకు నేను ప్రేమించే మనిషి’ అని రాసుకున్నాడు. ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం సిల్వర్ స్క్రీన్ మీద ఫోకస్ ఎక్కువగా పెడుతున్నాడు. అలాగే ఆహా ఓటిటి ప్లాట్ఫార్మ్ పై వస్తున్న కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ షోకి హోస్ట్ గా చేస్తున్నాడు.
![]() |
![]() |